తెలంగాణలో వారంరోజులుగా భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసి ముద్దైంది. వానకు పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. ఇక నగరవాసులతంగా ఇవాళ, రేపు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో అప్రమత్తంగా వుండాలని ప్రకటించింది. నేడు, రేపు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు వంకలు, ప్రాజెక్టులు…