తెలంగాణలో వారంరోజులుగా భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసి ముద్దైంది. వానకు పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. ఇక నగరవాసులతంగా ఇవాళ, రేపు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో అప్రమత్తంగా వుండాలని ప్రకటించింది. నేడు, రేపు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు వంకలు, ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
read also: Green India Challenge: ప్రగ్యా జైస్వాల్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన రెజీనా
ఎగువన కురుసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్ట్ నాలుగు గెట్లను ఎత్తి వేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాలుగు రోజులుగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో. ఆలయంలో తాత్కాలికంగా మూసివేసారు అధికారులు. రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు కొనసాగుతున్నాయి. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరాశ ఎదురవుతుంది.
Artemis-1: ఆర్టెమిస్-1 ప్రయోగానికి సిద్ధమైన నాసా.. అప్పుడేనా..?