Manisha Koirala: నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు జరిపింది. ఈ ఆందోళనలతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 50 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం, నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట్లాడిన పాత వీడియో వైరల్‌గా మారింది.