Manipur : మణిపూర్‌లో ఏప్రిల్ 19న ఓటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల దృష్ట్యా, మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.