బాలీవుడ్ నటి అంకిత లోఖండే ఈసారి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. పాపులర్ షో “బిగ్ బాస్ సీజన్ 15” త్వరలోనే హిందీలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితాలో అంకిత పేరు కూడా విన్పించింది. తాజాగా ఆమె ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. “ఈ సంవత్సరం నేను బిగ్ బాస్ లో పాల్గొంటానని మీడియాలోని…