మామిడి, అరటి పండ్లు ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అరటి పండు తీపిగా ఉండవచ్చు కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారిపోతుంది. ఇది పాలతో మిక్స్ చేయడానికి పనికిరాదు.. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.