“నారాయణతే నమో నమో…” అంటూ గానం చేస్తూ ఎస్.వరలక్ష్మి ‘సతీసావిత్రి’ చిత్రంలో తొలిసారి గళం వినిపించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అంతకు ముందే బాలగాయకుడిగా మధురం పంచి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణనే పరవశింప చేసిన ఘనత మంగళంపల్లి వారి సొంతం. “సలలిత రాగసుధారస సారం…” అని ఆలపించి, నటరత్న నందమూరి అభినయానికి తగిన గళవిన్యాసాలు చేసి ‘నర్తనశాల’లో సుధారసమే కురిపించారు మంగళంపల్లి. ఆపై యన్టీఆర్ కే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’లో “వసంత గాలికి వలపుల రేగ…” అంటూ…
(డా. మంగళంపల్లి జయంతి సందర్భంగా) మధుర మంగళ నాదమణులకు తళుకులద్దిన స్వరజ్ఞాని మంగళంపల్లి బాల మురళీకృష్ణ. కర్ణాటక, హిందుస్థానీ సంగీత సారాలను ఒడిసిపట్టిన విద్వన్మణి ఆయన. నటుడిగా, వాగ్గేయకారుడిగా, సినీ సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, నూతన రాగాల సృష్టికర్తగా, వయొలిన్ విద్వాంసునిగా బహుముఖ ప్రజ్ఞ కనబరించిన గొప్ప వ్యక్తి. అన్నింటినీ మించి ఆయన సరస్వతీ దేవి గారాల బిడ్డ. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూక శంకరగుప్తంలో 1930 /జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు…