ఏపీలో అమరావతి ఎప్పడూ హాట్ టాపిక్కే. తాజాగా అమరావతిని కార్పోరేషన్ గా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా రాజధాని గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. అమరావతి కాపిటల్ సిటీ ప్రభుత్వ ప్రతిపాదనకు రైతులు, గ్రామాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కురగల్లు, మందడం, నీరు కొండ ప్రాంతాల్లో రాజధాని గ్రామాలను విలీనం చేస్తున్నామని అధికారులు ప్రతిపాదన పెట్టారు. సీఆర్‌డీఏ…చట్టాల ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని…కార్పొరేషన్ సిటీకి వ్యతిరేమంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.…
అమరావతి ఉద్యమం ప్రారంభమయ్యి 600 రోజులు పూర్తైన సందర్బంగా న్యాయస్తానం టు దేవస్థానంకు ఉద్యమకారులు పిలుపునిచ్చారు. దీంతో రైతులు, మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. దీంతో రైతులు, మహిళలు రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు మహిళా ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం, వెంకటపాలెంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…