Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బిడ్డగా.. వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా.. వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడుతానని అన్నారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగలను రాజకీయంగా ఎదుగుదకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను…