నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి.…
ఈ ఆదివారం మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కౌంటర్లు, సెటైర్లతో ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈసారి మా ఎన్నికలు మెగా వర్సెస్ మంచు అనేలా మారిపోయాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంచు విష్ణు తాజాగా ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రకాష్ రాజ్ మంచు విష్ణు దొంగతనంగా ఓటు వేయించుకున్నాడు అని,…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు ఫిలిం…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరో మలుపు తిరిగాయి. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు కోరారు. ఈమేరకు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని, ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని మంచు విష్ణు పేర్కొన్నారు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్ లో పారదర్శకత…
మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయడంతో ‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానల్ ఉల్లంగిస్తోందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందన్నారు. ప్రకాశ్ రాజ్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కూడా పరోక్షంగా ఉంటుందంటూ విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరుగుతోండటంతో ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా, ‘మా’ ఎన్నికలతో మాకు ఎటువంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తెలుగు చలన…
మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు, మరియు అతని ప్యానెల్ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీతో ఫిలిం ఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు. అనంతరం ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలను అందచేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, హాట్ కామెంట్స్ చేశారు. ‘ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసాము. 10న ఎన్నికలు జరుగుతాయి..…
నటుడు మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం ఈరోజు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ నామినేషన్లు వేయగా, నేడు మంచు విష్ణు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్…
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కంటెస్టెంట్లు కూడా తన వంతు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన హీరో మంచు విష్ణు ప్రెస్ తో తాజాగా తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ విష్ణు చేసిన వ్యాఖ్యలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రస్తుత స్థితి గురించి తెలుపుతుంది. Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార “మా ప్రెసిడెంట్ అనేది ట్యాగ్ కాదు, బాధ్యత. నేను…