డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్.…