ఇండస్ట్రీలో రాణించాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు అవొచ్చని నటుడు మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. నేను పోషించిన మహావీర్ లామా పాత్రపై ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా…