Manchu Manoj: హీరోల కొడుకులే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో రాణించాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు అవొచ్చని నటుడు మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. నేను పోషించిన మహావీర్ లామా పాత్రపై ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా నాకు ప్రశంసలు అందించింది. కుటుంబసభ్యులతో కలిసి ఈ సినిమా చూడటం నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం” అని మనోజ్ తెలిపారు. అభిమానుల మద్దతు గురించి మాట్లాడుతూ, “నేను విజయం సాధించాలని నా అభిమానులు కోరుతున్నారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని గర్వంగా చెప్పగలను” అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ గురించి ప్రస్తావిస్తూ, “ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు చాలా అరుదు. రాజీపడకుండా సినిమాలు చేస్తున్నారు” అని ప్రశంసించారు.
Also Read : Ileana : సెట్‌లో ఆ డైరెక్టర్ అలా చేయడంతో ఏడ్చేసా..
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఇటీవల వచ్చిన హిట్స్‌పై మాట్లాడుతూ, “సుందరకాండ సూపర్ హిట్ అయింది. తర్వాత యూట్యూబర్ మౌళి చేసిన లిటిల్ హార్ట్స్ బ్లాక్‌బస్టర్ అయింది. మౌళి నిరూపించాడు – మోహన్ బాబు కొడుకు, చిరంజీవి కొడుకు మాత్రమే కాదు, ఎవరైనా హీరో కావచ్చు. మౌళీ, నీ సినిమాలో ఎప్పుడైనా విలన్ పాత్ర ఉంటే నేను చేస్తాను. ఆ తర్వాత మా మిరాయ్ సంచలనం సృష్టిస్తోంది. అలాగే కిష్కింధ పూరి కూడా విజయాన్ని అందుకుంది. ఒకేసారి రెండు సినిమాలు హిట్ అవ్వగలవని నిరూపించాం” అన్నారు. అలాగే రానున్న ఓజీ గురించి మాట్లాడుతూ, “ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి మర్చిపోలేనిది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది” అని మనోజ్ ధైర్యంగా చెప్పుకొచ్చారు. తన అప్‌కమింగ్ ప్రాజెక్టులపై మాట్లాడుతూ, “తరువాత డేవిడ్ రెడ్డితో ఒక యాక్షన్ స్టోరీ చేస్తున్నాను. అది బ్రిటిష్ కాలం నాటి కథ. తర్వాత అబ్రహం లింకన్, రక్షక్ చిత్రాలు చేస్తాను” అని తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!