పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంచు మనోజ్.. నిన్న మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘటనలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. తన భార్య మౌనికతో కలిసి పీఎస్‌కు వచ్చిన మనోజ్.. తన అనుచరులు పళణి, వినాయకతో ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేయించారు..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. Also Read…