బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడంలోనే అతని రూటు సెపరేటు…
మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నోరుమెదిపింది లేదు. దీంతో ఈ వివాదం చల్లారిపోతుంది…
ఇటీవల మంచు ఫ్యామిలీని వివాదాలు చుట్టుముడుతున్నాయి . మొన్నటికి మొన్న చిరు, మోహన్ బాబుల మధ్య వార్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక నిన్నటికి నిన్న.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై నిందలు మోపి అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తన తప్పేం లేదని, మోహన్ బాబు, మంచు విష్ణు నాయీ బ్రాహ్మణుడైన బాధితుడిపై బూతులు తిట్టాడని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ…
మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల అంశం, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు.. ఇలా ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌ను తక్షణమే తొలగించకపోతే చర్యలు…
గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా…
ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. సిరివెన్నెల అంత్యక్రియలకు టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సిరివెన్నెలను కడసారి చూసి సంతాపం తెలిపారు. అయితే ఆరోజు ఎక్కడా మోహన్ బాబు ఫ్యామిలీ కనిపించలేదు.. దీంతో మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదు…
సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగస్వామి నాయుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన… మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. Read Also: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి…
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే…