టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే కుటుంబం అంటే మంచు ఫ్యామిలి అనే చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు.. మనోజ్ మధ్య జరిగిన గొడవలు మామూలు గొడవలు కాదు. దీంతో తిరిగి ఈ ఫ్యామిలి మళ్ళి ఎప్పుడు కలుస్తుందా అని మోహన్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ విభేదాలపై మంచు లక్ష్మి మొదటిసారిగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, కుటుంబంపై ప్రేమ, అలాగే తనపై…
ఆస్తులు కోసం కాదు, ఆత్మగౌరవం కోసమేనంటూ.. మంచు మనోజ్ చేస్తున్న హడావిడి అటు సినీ పరిశ్రమ, ఇటు సొంత జిల్లా చిత్తూరులో హాట్ హాట్‌గా మారిపోతోంది. మొదట్లో ఇదేదో... వాళ్ళ ఇంటి వ్యవహారం, తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల రచ్చేలే అనుకున్నారు అంతా. కానీ... రాను రాను ఇదేదో అతిలా మారుతోందని, ఇరు వర్గాలు తెగేదాకా లాగుతుండటం, రచ్చ చేసుకుంటూ...మీడియా అటెన్షన్ కోసం పాకులాడుతుండటం లాంటివి ఎబ్బెట్టుగా మారుతున్నాయన్న టాక్ మొదలైంది.