విద్య నికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి వైఖరి వల్లే తమ ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. నాన్న (మోహన్ బాబు) గారికి అన్ని విషయాలు తెలియదని, వినయ్ గురించి ఆయనకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మా అమ్మ ఆసుపత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని మనోజ్ తెలిపారు. కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాన్న స్కూల్‌ను అక్కడ…