Maname OTT: సినిమా విజయం, అపజయంతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తించుకున్న టాలీవుడ్ హీరోలలో ఒకడు శర్వానంద్. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో అనేకమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా పొందాడు. ఈ హీరో చివరగా నటించిన సినిమా ‘మనమే’. రొమాంటిక్ సెంటిమెంట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇక కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్ట…