బీహార్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. మైక్రోఫోన్‌ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.