కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 81 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. బాలిక తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో శుక్రవారం సాయంత్రం గజోల్ ప్రాంతానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది.