ఎన్టీయార్, రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘యమదొంగ’తో తెలుగువారి ముందుకు వచ్చిన మలయాళీ నటి మమతా మోహన్ దాస్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. గత కొంతకాలంగా ఆమె మలయాళ, తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మమతా మోహన్ దాస్ నటించిన మలయాళ చిత్రం ‘లాల్ బాగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల…