ప్రధానిపై మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ బెంగాల్ అసెంబ్లీలో మోడీకి మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.