Haromhara: యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హరోంహర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. సుధీర్ సరసన మాళవిక శర్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.