పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని, వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారని,…