ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి చిత్రం (ప్రొడక్షన్ నెంబర్ 1)గా రూపొందుతున్న ఈ స్కైఫై డ్రామా, కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ సోమవారం (మార్చి 31, 2025) అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. డా. లతా రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టి శుభ సూచనలు…