Malla Reddy: మరోసారి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ మల్లారెడ్డి, గో బ్యాక్ అంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. శామీర్ పేట మండలం బొమ్మరాసి పేట గ్రామపంచాయతీ పరిధిలో గ్రామస్తులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.