సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రిజర్వాయర్‌ను ప్రారంభించడానికి ముందు కేసీఆర్ మల్లన్నకు పూజలు నిర్వహించారు. అనంతరం రిజర్వాయర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. మల్లన్న సాగర్ తెలంగాణకే తలమానికం అని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు ఆగలేదని, ప్రాజెక్టుపై వందలాది కేసులను సుప్రీంకోర్టు కోట్టేసిన…
రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని… అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు ఎన్ని టీఏంసీల…