(జూన్ 16న మల్లాది రామకృష్ణ శాస్త్రి జయంతి)తెలుగు భాషను ఎంత తీయగా పాఠకులకు అందివచ్చునో, అంతే మధురంగా శ్రోతలకూ వినిపించవచ్చునని చాటిన ఘనత మల్లాది రామకృష్ణ శాస్త్రి సొంతం. చిత్రసీమలో ప్రవేశించే నాటికే మల్లాది రామకృష్ణ శాస్త్రి కలం బలం చూపిన రచయిత. స్వస్థలం బందరులో బి.ఏ,, పూర్తి చేశాక, మదరాసులో ఎమ్.ఏ. తెలుగు చదివారు. యడవల్లి సుబ్బావధానుల ద్వారా వేదం, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా మహాభాష్యం అభ్యసించిన మల్లాది మాతృభాష తెలుగుతో పాటు అనేక…