Deepesh Bhan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ బాన్ మృతి చెందాడు. శనివారం ఉదయం క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు సభ్యులు తెలిపారు. ఇక దీపేష్ మరణ వార్త బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది.