ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా ఫ్యాన్సే ఆ జట్టును తిట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నప్పటి జట్టులా అనిపించట్లేదు. కొత్త సారథి హార్థిక్ పాండ్యా జట్టులో చేరడంతో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. అసలు ముంబై జట్టులో ఏం జరుగుతుంది..? వీళ్ల విభేదాలతో కనీసం ప్లే ఆఫ్ కు చేరేలా పరిస్థితి కనపడటం లేదు.