ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న లింగవివక్షపై మరోసారి నోరు విప్పింది తాప్సీ. ఇటీవల తను నటించిన ‘హసీనా దిల్‌రూబా’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో పారితోషికపు అసమానత గురించి వ్యాఖ్యానించారామె. మహిళా నటులు ఎక్కువ డబ్బు అడిగితే కష్టంగా…సమస్యాత్మకంగా భావిస్తారు. అదే హీరోలు తమ పారితోషికాలను పెంచితే… అది వారి విజయానికి చిహ్నంగా ఫీలవుతారు. నాతో పాటు కెరీర్ ప్రారంభించిన హీరోలు ఇప్పుడు నా కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ…