మాల్దీవుల మంత్రి మూసా జమీర్ ఇవాళ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో సమావేశం కానున్నారు. ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం లాంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్‌ను సందర్శించనున్నారు.