Maldives: మొండివైఖరి వదిలేసి భారత్ తో చర్చలు జరపండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives- India Relations: మాల్డీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ దేశ రుణ పునర్నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలను తాను చూశానని మాజీ ప్రెసిడెంట్ సోలిహ్ అన్నారు. దీనిపై భారత్‌తో మాట్లాడాలనుకుంటున్నాను.. అయితే ఆర్థిక సవాళ్లు భారతదేశం అప్పుల వల్ల కాదన్నారు. మాల్దీవులు చైనాకు 18 బిలియన్ల మాల్దీవుల రుఫియా (MVR) రుణాన్ని కలిగి ఉంది.. భారతదేశానికి 8 బిలియన్ల MVR రుణాన్ని కలిగి ఉంది అని తెలిపారు. దానిని తిరిగి చెల్లించే కాలం కూడా 25 సంవత్సరాలు అని చెప్పారు. అయితే, మా పొరుగు దేశం ( భారత్ ) సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది.. మనం మొండి వైఖరిని అవలంబించడం మానేసి వారితో మాట్లాడటం ప్రారంభించాలని ముయిజ్జూని సోలిహే కోరారు.
Read Also: Alfazolam at Hyderabad: కొత్తూర్ లో భారీగా ఆల్ఫాజోలం పట్టివేత..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మాకు సహాయం చేసే అనేక పార్టీలు ఉన్నాయి.. కానీ ముయిజ్జూ రాజీ పడటానికి ఇష్టపడడు అని సోలిహే తెలిపారు. ముయిజ్జూ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని పేర్కొన్నారు. ఎండీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ఈ సర్కార్ మళ్లీ ప్రారంభించి ప్రజలను మోసం చేస్తోందని మాజీ రాష్ట్రపతి అన్నారు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకే ప్రస్తుత మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ.. ఆ తర్వాత భారత్‌పై విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.. మానవతా, వైద్య తరలింపు కోసం ఉపయోగించే మాల్దీవులలోని మూడు విమానయాన స్థావరాలలో మోహరించిన 88 మంది భారతీయ సైనిక సిబ్బందిని మే 10 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రెసిడెంట్ ముయిజ్జూ డిమాండ్ చేశారు అనే విషయాన్ని సోలిహే గుర్తు చేశారు.
Read Also: Road Accident : గుంటలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఇక, ఇప్పటికే 26 మంది భారతీయ సైనిక సిబ్బందితో కూడిన మొదటి బృందం మాల్దీవులను విడిచి పెట్టింది అని మాజీ అధ్యక్షుడు సోలిహే తెలిపారు. వారి స్థానంలో స్థానిక సైనికేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, మాల్దీవులకు భారతదేశం అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉంటుందని ముయిజ్జు చెప్పారు.. ఏప్రిల్ 21వ తేదీన మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారత్‌తో సయోధ్యకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. చైనా మద్దతుదారు ముయిజ్జూ భారతదేశం నుంచి రుణ విముక్తి పొందడం కోసం ఇలాంటి కామెంట్స్ చేశాడని మాజీ ప్రెసిడెంట్ సోలిహ్ వ్యాఖ్యనించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!