ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే.. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ.. ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10…
మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడైన ఫహద్ ఫాసిల్ ఇటీవల నజ్లెన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ చిత్రం పూజా కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఒక చిన్న కీప్యాడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ స్మార్ట్‌ఫోన్‌లతో ఉంటున్న ఈ రోజుల్లో, ఫహద్ యొక్క ఈ చిన్న ఫోన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొదట్లో, ఈ వీడియోను చూసిన అభిమానులు ఫహద్‌ను మినిమల్ లైఫ్ స్టైల్ కి ఉదాహరణగా జరుపుకున్నారు. “పెద్ద…
Narivetta : మలయాళ స్టార్ నటుడు టొవినో థామస్ నటించిన యాక్షన్ డ్రామా ‘నరివేట్ట’. రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ మూవీని ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించగా అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేశారు. థియేటర్లలో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 11 నుంచి సోనీ లివ్‌లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.…
మోహన్ లాల్ కూతురు విస్మయ మలయాళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. జూడ్ ఆంథోనీ డైరెక్షన్లో ‘తుడక్కుమ్’ అనే సినిమాతో విస్మయ తన సినీరంగ ప్రవేశం చేస్తోంది. 2018 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత జూడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మోహన్ లాల్ అనుచరుడు ఆంటోనీ పెరంబవూర్ ఆధ్వర్యంలోని ఆశీర్వాద్ సినిమాస్ 37వ సినిమాగా విస్మయ మోహన్ లాల్ తొలి చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే జూడ్ రాశారు. కుమారుడు ప్రణవ్…
Anupama Parameshwaran : క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపీ కొత్త సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం నిరాకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బోర్డు తీరుపై మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బోర్డ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసింది.…
SHine Tom Chaco : దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటున్నాడు. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి అతనికి మలయాళ ఇండస్ట్రీలో అవకాశాలు దొరకట్లేదు. తాజాగా ఆయన యాక్సిడెంట్ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నేను జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వచ్చాను. రోడ్డు ప్రమాదం మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు…
Ghaati : అనుష్క శెట్టి నటించిన ఘాటీ మూవీ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. జులై 11న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనుష్క, ప్రభు మీద దీన్ని డిజైన్ చేశారు. క్రిష్ లిరిక్స్ అందించగా.. లిప్సిక, సాగర్ నాగవెల్లి,…
దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రానా, తర్వాత కాలంలో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఎన్నో సినిమాలు హిట్స్ కొట్టగా, కొన్ని సినిమాలు ఫ్లాప్స్ కూడా అయ్యాయి. అయితే, ఆయన చేస్తున్న రెండు సినిమాలు దాదాపుగా షెడ్యూల్‌కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆయన చేసిన ‘రానాయుడు’ సెకండ్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Also Read:Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్! అయితే, మరోపక్క ఆయన…
ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రెండు భాషల సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు సినిమాల గురించి. ఇప్పుడంటే పరిస్థితులు బాగాలేవు, హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బాహుబలి తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర భాషలకు కూడా వెళ్లి అక్కడ కూడా హిట్లయ్యాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు. Also Read:Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ…