Narivetta : మలయాళ స్టార్ నటుడు టొవినో థామస్ నటించిన యాక్షన్ డ్రామా ‘నరివేట్ట’. రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ మూవీని ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించగా అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేశారు. థియేటర్లలో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 11 నుంచి సోనీ లివ్‌లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో టొవినో థామస్ నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. వయనాడ్ ప్రాంతానికి వర్గీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం.. ఆ తర్వాత అక్కడి పరిస్థితులపై పోరాడటం అనే కాన్సెప్ట్ తో మూవీని తెరకెక్కించారు.
Read Also : Priyamani : నేను కాపీ కొట్టలేదు.. ప్రియమణి వివరణ..
ఆదివాసీ సంఘాలు తమకు భూమిని కేటాయించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంపై చేసే పోరాటాలు.. ఆ సమస్యలను ఆ కానిస్టేబుల్ ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఇందులో కథ. ఇందులో టోవినో థామస్‌తో పాటు, సూరజ్ వెంజరమూడు, చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, ప్రణవ్ టియోఫిన్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు. ఎన్ ఎం బాదుషా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, జేక్స్ బెజోయ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.
Read Also : Thammudu : మా అమ్మ ముందే సిగరెట్ తాగాను.. నటి షాకింగ్ కామెంట్స్..