ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక ఇప్పటికే మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు ఉత్తరాదిన తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఐదేళ్ల క్రితం ‘బియాండ్ ద క్లౌండ్స్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ సినిమాల్లో కంటే కమర్షియల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అదే సమయంలో సినిమాల ఎంపికపై ఆచితూచి అమ్మడు అడుగులు వేస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీలో మాళవిక మోహనన్ నటించబోతోందనే…
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఎలా హద్దు మీరి ప్రవర్తిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు. తాము చేస్తోంది కరెక్టా, కాదా అనేది ఆలోచించరు.. ఏది తోస్తే అది చేసేస్తుంటారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్, సినిమాల్లో చేసే ఇంటిమేట్ సీన్లపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. కథానాయికలూ ఊరికే ఉండరులెండి, కొందరు అప్పటికప్పుడే ఘాటు రిప్లై ఇస్తూ ఆ ఆకతాయిల నోళ్ళు మూయించేస్తారు. తాజాగా మాళవిక…
మాస్టర్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కుర్రకారుకు క్రష్ లిస్టులోకి చేరిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న బ్యూటీ ఇటీవలే ధనుష్ సరసన మారన్ లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అమ్మడి అందం మెస్మరైజ్ చేసేలా ఉండడంతో ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఇక కొంచెం గ్యాప్…
సాధారణంగా నూతన సంవత్సరాన్ని జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను నూతన ప్రారంభోత్సవంగా సెలెబ్రేట్ చేసుకుంటాము. అయితే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలు విభిన్నమైన తేదీల్లో జరుగుతాయి. ఏప్రిల్ 15న కేరళలో సాంప్రదాయ మలయాళ నూతన సంవత్సర ప్రారంభాన్ని విషు అనే పేరుతో పండగగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడమే కాకుండా కుటుంబంతో రుచికరమైన సాంప్రదాయ విందును ఆస్వాదిస్తారు. ఈ ప్రత్యేక…
Maaran కోలీవుడ్ స్టార్ ధనుష్ కథకు మంచి ప్రాధాన్యమున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు స్టార్స్ స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. తాజాగా ధనుష్ కూడా అలాగే చేసినట్టున్నాడు. మార్చ్ 11న ధనుష్ నటించిన “మారన్” అనే చిత్రం నేరుగా డిజిటల్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్…
Raja Deluxe మూవీపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో ఇకపై చిన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు రెబల్ స్టార్. ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి విరామం లేకుండా పని చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో Raja Deluxe చిత్రానికి ఇటీవలే సంతకం చేశారు. ఇక ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో పూర్తి చేయబోతున్నారట. హారర్-కామెడీ కలయికలో కథాంశంతో రూపొందిన…
కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం “మారన్” నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం పాపులర్ ఓటిటి ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు “మారన్” విడుదలకు చిన్న అంతరాయం ఏర్పడింది. సినిమా విడుదల టైమింగ్ మారినట్టు తెలియజేస్తూ డిస్నీ కొత్త అప్డేట్ను వెల్లడించింది. Read Also : ET Review : ఎవరికీ తలవంచడు (తమిళ డబ్బింగ్) సాధారణంగా ఓటిటి…