లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హాత్ట్ టాపిక్ అయ్యారు. గతంలో ‘మాస్టర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాళవిక మోహనన్ “నేను ఒక సీన్ చూసాను, అందులో హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పైన ఉంది. పేషంట్ లా ఉండాల్సిన హీరోయిన్, మేకప్ వేసుకోని ఉండడం ఏంటో అర్ధం కాలేదు. అది కమర్షియల్ సినిమా అని తెలుసు కానీ కొంచెం అయినా రియలిస్టిక్ గా ఉండాలి కదా” అంటూ ఇండైరెక్ట్ గా నయనతార గురించి కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ నయనతార వరకూ వెళ్లడంతో “నేనొక ఇంటర్వ్యూ చూసాను, అందులో ఒక హీరోయిన్ నా పేరు చెప్పలేదు కానీ తను చెప్పింది నా గురించే. అందులో హాస్పటల్ సీన్ లో నటించింది నేను, అయితే ఇప్పుడు హాస్పిటల్ సీన్ అనగానే జుట్టు అంతా చెరిపేసుకోని బెడ్ పైన పడుకోవాలనేమి లేదు. హాస్పటల్ స్టాఫ్ మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పైగా అది ఆర్ట్ సినిమా కాదు కమర్షియల్ సినిమా. నా డైరెక్టర్ ఎలా చెయ్యమంటే అలానే చేశాను, కమర్షియల్ సినిమాలో మరీ అంత మెలోడ్రామా ఉండాల్సిన అవసరం లేదు” అంటూ నయన్ కూడా మాళవిక మోహనన్ పేరు చెప్పకుండానే కౌంటర్ వేసేసింది. ఈ విషయంలో కొంతమంది మాళవిక మోహనన్ కి సపోర్ట్ చేశారు, మరికొంతమందేమో నయనతారకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇష్యూని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ నయన్ ఫాన్స్ vs మాళవిక మోహనన్ గొడవ మొదలయ్యింది.
క్రిస్టీ అనే మలయాళ సినిమాలో నటించిన మాళవిక మోహనన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ గురించి మాట్లాడుతూ… నాకు లేడీ సూపర్ స్టార్ అంటే నచ్చదు. అలా ఎవరినీ పిలవకండి. సూపర్ స్టార్ అనండి అంతే కానీ లేడీ సూపర్ స్టార్ ఏంటి? దీపికా, అలియా భట్ లని సూపర్ స్టార్స్ అంటాం కానీ లేడీ సూపర్ స్టార్ అని పిలవము కదా. సో లేడీ సూపర్ స్టార్ అని ఎవరినీ అనకండి” అంటూ ఓపెన్ గా చెప్పేసింది. నయనతారకి లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే కదా, మాళవిక మోహనన్ ఇంటర్వ్యూ వైరల్ అవ్వగానే… మాళవిక కావాలనే నయనతారకి టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ లో గట్టిగా వినిపిస్తుండడంతో మాళవిక మోహనన్ ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యింది. “నేను చెప్పింది అందరి గురించి, ఏ ఒక్క హీరోయిన్ గురించి స్పెసిఫిక్ గా చెప్పలేదు. నాకు నయనతార అంటే రెస్పెక్ట్ ఉంది, ఒక సీనియర్ గా ఇండస్ట్రీలో ఆమె జర్నీ చాలా గ్రేట్. ఇప్పటికైనా పీపుల్ సైలెంట్ అవ్వాలి అని కోరుకుంటున్నా… నాకు నయన్ అంటే ప్రేమ మాత్రమే ఉంది” అంటూ మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది. హీరోయిన్స్ ని వేరు చేసి లేడీ సూపర్ స్టార్ అనకండి, జస్ట్ సూపర్ స్టార్స్ అనండి… అందరూ ఆర్టిస్టులే, ఆర్టిస్టులకి మేల్-ఫిమేల్ ఉండదు అని చెప్పే ప్రాసెస్ లో మాళవిక మోహనన్ ఆ మాటలు వాడింది కానీ అవి రాంగ్ గా బయటకి వెళ్ళాయి. మరి ఇప్పుడు చేసిన ట్వీట్ తో అయినా నయనతార ఫాన్స్ కూల్ అవుతారేమో చూడాలి.
My comment was about a term that is used to describe female actors & not about any specific actor. I really respect & admire Nayanthara, and as a senior really look upto her incredible journey. Can people please calm down. Especially the tabloid journos.
Only ♥️ to Miss N https://t.co/QyrfqOoJWU
— Malavika Mohanan (@MalavikaM_) February 12, 2023