వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణలో రెండో రోజు భారత్ జూడో యాత్ర కొనసాగుతుంది. జూడో యాత్రలో భాగంగా.. రాహుల్ ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు. కాసేపు సరదాగా సాగింది. అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. టీ.కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్‌ఎస్ పై ఫైర్ అవుతున్నారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నేడు తెలంగాణలో రెండోరోజు పాదయాత్ర సాగనుంది. నేడు ఉదయం 6 గంటల 30నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది.
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2018లో అధికారపార్టీ టికెట్‌పైనే పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారా లేక కొత్త వారు బరిలో ఉంటారా? అనే ప్రశ్న చుట్టూనే మక్తల్ గులాబీ శిబిరంలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రామ్మోహన్‌రెడ్డి భార్య సుచరితారెడ్డి పేరు రేస్‌లోకి రావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గత…