ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్లను దూకుడుగా నిర్వహిస్తోంది. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తాను సినిమాలో మేకప్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. “పుష్ప” కోసం తాను చాలా కష్టపడ్డానని, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం తానెప్పుడూ పెద్దగా…