న్యూయార్క్ స్టాక్ ఎక్చైంజ్(NYSE) లిస్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఫిస్కర్ ఇంక్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇది సాఫ్ట్‌వేర్ మరియు వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ సపోర్ట్ ఫంక్షన్‌లపై దృష్టి సారిస్తుంది. కాలిఫోర్నియాకు చెందిన ఈవీ తయారీ సంస్థ ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించిందని, దీంతో భారతదేశంలో 200 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రపంచ సంస్థలను ఆకర్షించేందుకు పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని…