BJP: కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు. చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో…