తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు వేదికలను ప్రారంభించింది.. మండల కేంద్రాల్లో రైతులు సమావేశమై.. వారి సమస్యలు, పంటలు, రైతుబంధు.. ఇలా అనేక విషయాలను చర్చించుకునేందుకు వీలుగా ఈ వేదికలు నిర్మించింది ప్రభుత్వం.. ఇక, రైతు వేదికల వలె మహిళా వేదికలు కూడా నిర్మించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.. రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల మాదరిగా మహిళా వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని…