దాదాపు రెండేళ్ళ క్రితం రూ. 1500 కోట్ల భారీ వ్యయంతో మూడు భాషల్లో, మూడు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తామని అల్లు అరవింద్, నితీష్ మల్హోత్ర, మధు మంతెన ప్రకటించారు. ఈ త్రీడీ మూవీని నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. అప్పటి నుండీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాలో రాముడిగా ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తాడని, సీతగా దీపికా పదుకునే, రావణాసుడి పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తారనే ప్రచారం జరిగింది.…