జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తమ అధినేత నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అధినేత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ నిర్ణయానికి ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరం అని వారంతా అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరంపై తెలంగాణ ఎన్నారై మహేష్ బిగాల ప్రపంచ…