ఐపీఎల్‌లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ కెరీర్‌లో కెప్టెన్‌గా ధోనీకి ఇదే చివరి మ్యాచ్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ చేరడంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విఫలమైంది. దీంతో లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రంగా మిగలనుంది. ఈ మ్యాచ్ గురించి ఎన్టీవీ స్పెషల్ లైవ్ విశ్లేషణ గురించి తెలుసుకోవాలంటే…
డిఫెండర్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ ఎంత దారుణమైన పెర్ఫార్మెన్స్ కనబరుస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంది. పోనీ.. మిగిలిన మ్యాచెస్‌లో అయిన తన బ్రాండ్‌కి తగినట్టు అదరగొడుతుందనుకుంటే, ఆ ఆశల్నీ నిరుగార్చేస్తోంది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోన్న మ్యాచ్‌లోనూ చెన్నై పెద్దగా రాణించలేదు. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై,…
గొప్ప బ్యాటింగ్ లైనప్ కలిగిన ఐపీఎల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టాపార్డర్ విఫలమైతే, మిడిలార్డర్ పటిష్టంగా రాణించగలదు. ఐదు వికెట్ల కోల్పోయిన తర్వాత కూడా, చెన్నై జట్టు మంచి స్కోరు సాధించగలదు. అందుకే, ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఈ జట్టు చెలామణి అవుతోంది. అలాంటి చెన్నై, ఈరోజు ముంబై బౌలర్ల చేతిలో కుదేలైంది. కేవలం 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, చెన్నై జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే! తొలుత…
అసలే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంత మాత్రమే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు నీరుగారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టుకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పక్కటెముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా ఛాతిపై గాయాలయ్యాయి. అందుకే, అతడు…
క్రికెట్ ప్రియులు, ముఖ్యంగా ధోనీ అభిమానులు.. క్రీజులోకి వెళ్ళడానికి ముందు ధోనీ బ్యాట్ కొరకడాన్ని చాలా సందర్భాల్లో గమనించే ఉంటారు. అంతెందుకు.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కి రావడానికి ముందు తన బ్యాట్ కొరుకుతూ కెమెరాకి చిక్కాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలెందుకు ధోనీ ఇలా చేస్తాడని గతంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేసినా, సమాధానం దొరకలేదు. అయితే, ఇన్నాళ్ళ తర్వాత మాజీ క్రికెటర్ అమిత్…
2007లో టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత కెప్టెన్‌గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది…
రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా ఈద్ సంబరాలను నిర్వహించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఈద్ సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులతో ధోనీ సరదాగా గడపడం…
టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఐపీఎల్‌లో తన ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. హర్భజన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా క్రిస్‌గేల్, రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని వన్‌డౌన్ ప్లేయర్‌గా భజ్జీ పేర్కొన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. వికెట్ కీపర్‌గా ధోనీని హర్భజన్ ఎంచుకున్నాడు. ఈ టీమ్‌కు కెప్టెన్ కూడా ధోనీనే అని అతడు పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్లుగా…
2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ…
ఐపీఎల్-15లో తొలి మ్యాచ్‌లోనే ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత తడబడింది. అయితే ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అసలు 120 పరుగులన్నా చెన్నై చేస్తుందా అని సందేహాలు కలిగిన వేళ.. ఆ జట్టు ఏకంగా 131 పరుగులు చేసింది. ధోనీ (50 నాటౌట్), జడేజా (26 నాటౌట్) భాగస్వామ్యంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు చేసింది.…