Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్‌నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు. రాయ్‌గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం…