రేపు మహా శివరాత్రి పర్వం.. హిందువులకు ఇదో పెద్ద పండుగ. జాగారాలు, ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. కొందరు వృత్తి రీత్యా హైదరాబాద్‌కి వచ్చి శివరాత్రికి ఇంటికి వెళ్ల లేక పోతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం, పట్నంకి దగ్గర్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. రేపే (ఫిబ్రవరి 26)న మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కాగా.. శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం...
మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు.
రేపే మహా శివరాత్రి. శివుని ఆరాధించే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. శివరాత్రి అంటే శివుని ఆరాధనలో ఉపవాసం, జాగారం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం. శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేసి శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
రేపే మహా శివరాత్రి. ఇది పరమేశ్వరుడి భక్తులందరికీ అత్యంత ఇష్టమైన రోజు. అంతే కాకుండా జ్యోతిష్య ప్రకారం కూడా చాలా కీలకం. ఉచ్ఛ స్నథితిలో శుక్రుడు, మీన రాశిలో బుధుడు, వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభ రాశిలో రవి, శని రాశులు మహా శివరాత్రి నుంచి సంచారం చేయనున్నాయి. ఈ రోజున భక్తులు శైవ క్షేత్రాలకు పరుగులు తీస్తుంటారు. శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. కానీ.. శివుడి పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలట. అవేంటో ఇప్పుడు…
శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. "దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు..