తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివ స్వాముల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు అధ్వర్వంలో దాదాపు 300 మంది శివ భక్తులు శివుడి మాలధారణ ధరించారు. నుదుటన, విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివ మాల ధారణ వేశారు. ప్రతి ఏడాది శివరాత్రికి 41 రోజుల ముందు శివుడి…