మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది.