Tirupati: తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. స్వామివారి ఏకాంత సేవ ముగిసిన అనంతరం, విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం మత్తులో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఆలయం వెనుక భాగం గోడ దూకి లోపలికి ప్రవేశించిన అతడు, భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే మహా ద్వారం లోపలి గోపురం పైకి ఎక్కి, గోపురంపై ఉన్న పవిత్ర కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు.…